భారతదేశంలోని పలు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అధిక లాభాలు పొందాయి. ప్రతి ఐదు కంపెనీలలో నాలుగు కంపెనీలు లాభాల బాటలో నడిచినట్లు సర్వేలు చెపుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పలు దేశీయ కంపెనీలు అధిక లాభాలను ఆర్జించాయి. వీటిలో దాదాపు ప్రతి ఐదు కంపెనీల్లో నాలుగు కంపెనీలు లాభాల బాటలో పయనించినట్లు సర్వేల్లో తెలిసింది.
దేశీయ కార్పోరేట్ సెక్టార్లలో ముడి చమురు ధరలలో తగ్గుదల కనపడటం, ఉద్యోగుల జీతాలు, వడ్డీరేట్లలో తగ్గుదలతో లాభాలు పొందినట్లు ప్రముఖ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలినట్లు సమాచారం.
తాము నిర్వహించిన సర్వేలో దాదాపు 850 లిస్టెడ్ కంపెనీలు తొలి త్రైమాసికంలో లాభాలు పొందాయని ఆ పత్రిక వెల్లడించింది. ఇది నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి పోలిస్తే ఈ కంపెనీల లాభాలు 13శాతం పెరిగాయి.
గడచిన మూడు త్రైమాసికాలలో ఈ కంపెనీలకు తరచూ నష్టాలను చవిచూడాల్సివచ్చిందని సర్వే చెపుతోంది. దీనికారణంగా బ్యాంక్ ద్వారా వచ్చే ఆదాయంపై వడ్డీ రేట్లలోకూడా మార్పులు సంభవించిన కారణంగానే తమకు నష్టాలు వచ్చినట్లు ఆ సర్వే తెలిపింది.
నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ తెలిపిన వివరాల ప్రకారం నిఫ్టీలో నమోదు చేసుకున్న కంపెనీల్లో 22 కంపెనీల తొలిత్రైమాసికపు ఫలితాలు వచ్చాయని మిగిలిన మరికొన్ని కంపెనీల వివరాలు రావాల్సి ఉందని సంస్థ తెలిపినట్లు సర్వే పేర్కొంది.
నిఫ్టీకి తెలిపిన వివరాల ప్రకారం ఆ 22 కంపెనీలు దాదాపు 25శాతంపైగా లాభాలు ఆర్జించాయి. గడచిన నాలుగు త్రైమాసికాలలో ఈ కంపెనీల నికర ఆదాయం 3నుంచి 8శాతం పెరిగింది. రానున్న రోజుల్లో కంపెనీల పనితనం మెరుగ్గా ఉంటుందని నిఫ్టీ తెలిపింది.
ఇదిలావుండగా జూన్‌తో ముగిసిన త్రైమాసికాంతానికి కంపెనీలు వేతనాలను పెంచడంతో కంపెనీలకు 10శాతం ఖర్చులు పెరిగాయి. గడచిని నాలుగు త్రైమాసికాలలో వేతన వృద్ధి 15నుంచి 25శాతం జరిగింది.
వడ్డీ రేట్లలో తగ్గుదల రావడంతో కంపెనీల పనితనంలో తొలిత్రైమాసికంలో కేవలం 20శాతం మాత్రమే పెరుగుదల కనపడింది. అదే గత త్రైమాసికపు ఫలితాలలో కంపెనీల పనితనం మెరుగ్గా ఉండి ఉత్పత్తులు 30శాతం మేరకు వృద్ధి జరిగిందని నిఫ్టి తెలిపిందని ఆ పత్రిక పేర్కొంది.
తమ సర్వేలో పాల్గొన్న దాదాపు 82శాతం కంపెనీలు జూన్‌తో ముగిసిన త్రైమాసికాంతానికి మెరుగైన లాభాలను ఆర్జించాయి. గడచిన మూడు త్రైమాసిక ఫలితాలలో పలు కంపెనీలు దాదాపు 70-72శాతం కంపెనీలు నష్టాలను చవిచూసాయి.
నిరుడు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నష్టాలను చవిచూసిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మంచి లాభాలు గడించాయి. సర్వేలో పాల్గొన్న 850కంపెనీల్లో జరిగిన అమ్మకాలలో కేవలం నాలుగుశాతం వృద్ధి జరిగింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జరిగిన అమ్మకాలు దాదాపు 9శాతం వృద్ధి జరిగినట్లు సర్వే తెలిపింది.