Other Banks | ATM's | Money | People | Facility | Customer | ఇతర ఏటీఎంలనుంచి డబ్బులు డ్రా చేయాలంటే...
FILE
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రోజునుంచే ప్రజలకు ఈ సదవకాశం కల్పించింది. దీంతో ప్రజలు ఈ సౌకర్యానికి సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇలాంటి సేవలు తీసుకున్నందుకు వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
కాని ఇకపై ఈ అవకాశంకూడా కేవలం ఐదు సార్లేనని ఆర్‌బీఐ నిర్ణయించింది. అంటే ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయాలనుకుంటే నెలకు కేవలం ఐదు సార్లు మాత్రమే డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
ఇలా ఐదు సార్లు పొందిన సేవలకుగాను ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే ఆరవ సారి మీరు ఏదైనా ఏటీఎంలనుంచి డబ్బులను డ్రా చేస్తే మీరు తప్పకుండా రూ. 20లు చెల్లించాల్సి వస్తుంది. కాని ఈ నిర్ణయం ఎప్పటినుంచి అమలవుతుందనేది ఇంకా తెలియరాలేదు.