సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » కథనాలు » మౌళిక వసతులందిస్తున్న కంపెనీలను కాపాడుకోగలమా..! (YSR | Helicopter | Infrastructure | Krishnapatnam | Gangavaram | Ports)
Feedback Print Bookmark and Share
 
FILE
డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో రాష్ట్రంలోని ఇతర సంస్థల కన్నా మౌళిక వసతుల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) సంస్థలపై ఎక్కువ ప్రభావం చూపవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.

రాజశేఖరరెడ్డి పరిపాలనా కాలంలో మౌళిక వసతుల అభివృద్ధికి పెట్టింది పేరుగా ఉండింది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, కృష్ణపట్నం, గంగవరంలాంటి ఆధునిక ఓడ రేవుల నిర్మాణం చేపట్టడం, ప్రత్యేక ఆర్థిక మండలాల(ఎస్ఇజడ్‌ల) వృద్ధి, ఉత్పాదక యూనిట్ల స్థాపన తదితర మౌళిక వసతుల ప్రాజెక్టులను ఆయన పరిపాలనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

ఉదాహరణకు అపాచే, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్, ఎన్‌టీపీసీ- భెల్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లాంటి కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్ల స్థాపనకు వైఎస్ ఎంతో శ్రమించారు. గడచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై రూ. 41 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వైఎస్ తన పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన జలయజ్ఞం కార్యక్రమాన్ని భవిష్యత్తులో కొనసాగించలాలంటే బృహత్ కార్యక్రమమే కాగలదు. ప్రస్తుత ముఖ్యమంత్రిపై ఈ బాధ్యతలున్నాయని, ఈ పథకం కింద రూ. 1 లక్షా 76 వేల కోట్ల ఖర్చుతో దాదాపు 84 నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు.

గతంలో సత్యం వ్యవస్థాపకుడు, మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు ఏర్పాటు చేసిన మెటాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఇటీవలే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ స్వాధీనం చేసుకుంది.

అలాగే నిర్మాణ రంగానికి చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ఇందూ ప్రాజెక్ట్స్, నవయుగ ఇంజనీరింగ్, గాయత్రి ప్రాజెక్ట్స్‌తో సహా రాష్ట్రంలో ప్రధాన మౌళిక వసతుల రూపకల్పన చేసే సంస్థలన్నీ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమాలవల్ల గతంలో లబ్ధి పొందినవే.

ఆయన స్థానంలో వచ్చిన ముఖ్యమంత్రి అదే ఊపుతో ఆ పథకాలను కొనసాగించకపోతే ఆయా కంపెనీలు నష్టానికి గురి కాక తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు.

దీంతో భవిష్యత్తులో ఈ కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చివరికి అరబిందో, హెటెరో డ్రగ్స్‌లాంటి ఔషధ సంస్థలు కూడా రాష్ట్రానికి వచ్చాయంటే అది వైఎస్ చలవేనంటున్నారు విశ్లేషకులు.

వీటిని కేంద్రం ప్రభుత్వంనుంచి మంజూరు చేయించడానికి ఆయన తనవంతు కృషి చేసి రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని, రాష్ట్రానికి వచ్చిన పలు సంస్థలను నిలుపుకునేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంతో కృషి చేయాల్సి ఉందని, దీంతో ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు ఆర్థికరంగ నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.