సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » కథనాలు » పలు కంపెనీల ఉద్యోగులకు పెరగనున్న జీతాలు (Indian Companies | Slaries | Plans | India | Japan | Hongkong | Haviat Associates)
Feedback Print Bookmark and Share
 
దేశీయ సంస్థలలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.

భారతదేశంలోని ఉద్యోగుల జీతాలు వచ్చే ఆర్థిక సంవత్సరంనాటికి గణనీయంగా పెరిగిపోతాయని హాంగ్‌కాంగ్‌కు చెందిన హేవిట్స్ అసోసియేట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంనాటికి పలు కంపెనీలు పెద్ద మొత్తంలో వేతనాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని తమ సర్వేలో తేలినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ఆసియా ఖండంలోని అన్ని దేశాలు ఆర్ధిక మాంద్యం దెబ్బ నుంచి త్వరితగతిని కోలుకుంటూ ఉండటమే దీనికి ప్రధాన కారణమని సర్వే నిర్వహించిన సంస్థ చెబుతోంది.

పలు కంపెనీలు తమ ఉద్యోగులకు పెంచాలనుకున్న జీతాల్లో మూలవేతనంలో భారతదేశంలో పది శాతం ఉంటుందని అంచనా వేశారు. ఇండోనేషియా, చైనా దేశాల్లో ఈ పెరుగుదల 8.7, 6.7 శాతాలుగా ఉండబోతున్నాయి. జపాన్ మాత్రం కేవలం 2.1 శాతం పెరుగుదలను మాత్రమే ఇవ్వబోతోందని ఆ సంస్థ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.