ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > మార్కెట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
100 పాయింట్లతో వృద్ధి చెందిన నిఫ్టీ  Search similar articles
స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్ భారీ అంచనాల నడుమ ప్రారంభమై రోజంతా అదే విధంగా కొనసాగింది. నిఫ్టీ 5100 పాయింట్ల మార్కును దాటగా, సెన్సెక్స్ 17,300 పాయింట్లకు ఎగువన స్థిరపడింది. వీటితోపాటే మిడ్‌కాప్, స్మాల్ కాప్‌లు కూడా లాభాల బాటనే నడిచాయి. విదేశీ విపణుల ప్రభావంతో ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలు సాధించాయి. ఇదే విధమైన జోరు ఐరోపా మార్కెట్లలో కూడా చోటుచేసుకుంది. భారత మార్కెట్‌లో రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్, కాపిటల్, గూడ్స్ వంటి కంపెనీల షేర్లు బాగా లాభాలను నమోదు చేశాయి.

శుక్రవారం ట్రేడింగ్ మార్కెట్‌కు చాలా ముఖ్యమైనది. ద్రవ్యోల్బణం రేటును మరోసారి శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం మార్కెట్‌పై పడే అవకాశం ఉంది. గురువారం మార్కెట్‌లో ఆశావహ వాతావరణంలో నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల తేడాతో ప్రారంభమైంది. ఒక దశలో నిఫ్టీ 5130-5140 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

శుక్రవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 5175-5190 పాయింట్ల వద్దకు చేరుకోగలదని అంచనాలు వేశారు. మార్కెట్లో నిఫ్టీ 5190 పాయింట్ల వద్ద ప్రారంభమై స్వల్ప కాలంలోనే 5215-5225 పాయింట్లకు చేరుకోగలదు. సోమవారం మార్కెట్‌కు బుద్ధ జయంతి కారణంగా సెలవు కావడంతో శుక్రవారం ట్రేడింగ్ భారీగానే జరుగగలదు.

నిఫ్టీ సాంకేతిక ఛార్టును పరిశీలిస్తే శుక్రవారం ట్రేడింగ్ ఆశావహ రీతిలో సాగుతుంది. శుక్రవారం ట్రేడింగ్‌లో ప్రజ్ ఇండ్, చంబల్ ఫెర్టిలైజర్స్, డీఎల్ఎఫ్, సెయిల్, సీమెన్స్ వంటి కంపెనీల షేర్లు మంచి ధరలు పలుకుగలవు.
మరిన్ని
లాభాలతో ముగిసిన మార్కెట్
మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాలు
సెన్సెక్స్ 256 పాయింట్లు వృద్ధి
స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 207 పాయింట్లు
మార్కెట్‌ లాభాల బాట
ఐదువేల మార్కు దాటిన నిఫ్టీ