స్టాక్ మార్కెట్ బుధవారం సాయంత్రం నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 100 పాయింట్లు బలహీనపడి 12,576 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 44 పాయింట్లు క్షీణించి 3,817 వద్ద ముగిసింది. వాస్తవానికి బుధవారం ఉదయం 65 పాయింట్ల లాభంతో 12,741 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది.
తాజా కొనుగోళ్ల ప్రభావంతో ఇండెక్స్ సూచీ పుంజుకోవడం ప్రారంభించి 12,935 వద్దకు చేరింది. అయితే మధ్యాహ్నం జరిగిన ట్రేడింగ్‌ల ప్రభావం ఒక్కసారిగా ఇండెక్స్ సూచీని మళ్లీ నష్టాల్లోకి నెట్టింది. దీంతో ఒకానొక దశలో 421 పాయింట్లు కోల్పోయి 12,514 వద్దకు పడిపోయింది.
చివరి ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లో ఏకంగా పదిశాతం మేర ఇండెక్స్ నష్టపోవడం నేటి మార్కెట్‌లో ప్రధానాంశం. దీంతో బుధవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,692 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 1,801 కంపెనీల వాటాలు నష్టాల్లోనే నడిచాయి... అలాగే 812 కంపెనీల వాటాలు లాభాల్లో నడువగా... మిగిలిన కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.
లాభపడ్డ కంపెనీలు... రాన్‌బాక్సీ, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, హిందుస్థాన్ యునిలివర్, అంబుజా సిమెంట్స్, ఐటీసీ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.
నష్టాలను చవిచూసిన కంపెనీలు డీఎల్ఎఫ్, జైప్రకాశ్ అసోసియేట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టాటా స్టీల్, టీసీఎస్, ఏసీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.
|