స్టాక్ మార్కెట్ గురువారం లాభాల దిశగా వెళుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 339 పాయింట్లు పెరిగి 12,915 వద్ద నడుస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 71 పాయింట్లు పుంజుకుని 3,888 వద్ద కొనసాగుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, జైప్రకాశ్ అసోసియేట్స్, డీఎల్ఎఫ్, ఎస్‌బీఐ, సత్యం, ఏసీసీ, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. రాన్‌బాక్సీ మినహా మరే ఇతర సంస్థలు కూడా పెద్దగా నష్టాల్లో లేవు.
|