స్టాక్ మార్కెట్ గురువారం లాభాల దిశగా వెళుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 465 పాయింట్లు బలపడి 13,041 వద్ద నడుస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 110 పాయింట్లు పుంజుకుని 3,927 వద్ద కొనసాగుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ, జైప్రకాశ్ అసోసియేట్స్, మారుతీ, ఎల్అండ్‌టీ, టీసీఎస్, డీఎల్ఎఫ్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, టాటా మోటార్స్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. రాన్‌బాక్సీ, టాటా స్టీల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు 2,649 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 1,484 కంపెనీల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే 1,086 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తుండగా... మిగిలిన కంపెనీల వాటాలు స్థిరంగా నడుస్తున్నాయి.
|