ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > మార్కెట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లాభాలతో ముగిసిన మార్కెట్  Search similar articles
స్టాక్ మార్కెట్ గురువారం లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 536 పాయింట్లు బలపడి 13,112 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 130 పాయింట్లు పుంజుకుని 3,947 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావంతో గురువారం మార్కెట్ 334 పాయింట్లు లాభంతో 12,910 వద్ద ప్రారంభమయ్యింది.

కొద్ది సమయంలో ఇండెక్స్ ఒడిదుడుకులకు లోనయినప్పటికీ... పై స్థాయి కంపెనీల కొనుగోళ్లతో సెన్సెక్స్ తిరిగి పుంజుకుంది. దీంతో ఒకానొక సమయంలో గరిష్ఠంగా ఇండెక్స్ సూచీ 13,150వద్దకు చేరుకుంది. దీంతో సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,689 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 1,529 కంపెనీల వాటాలు లాభాల్లో పయనించాయి. అలాగే 1,088 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనించగా... మిగిలిన 72 కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.

లాభపడ్డ కంపెనీలు...
హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, జైప్రకాశ్ అసోసియేట్స్, డీఎల్ఎఫ్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, బీహెచ్ఈఎల్, సత్యం, ఏసీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, రిలయన్స్, ఐటీసీ భారతి ఎయిర్‌టెల్, విప్రో, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యునిలివర్, హిండాల్కో తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.

నష్టాలను చవిచూసిన కంపెనీల
రాన్‌బాక్సీ, టాటా స్టీల్ తదితర సంస్థల వాటాలు మాత్రమే నష్టాలను చవిచూశాయి.
మరిన్ని
బలపడుతున్న సెన్సెక్స్
పుంజుకున్న మార్కెట్
లాభాల దిశగా వెళుతున్న మార్కెట్
బలంగా పుంజుకున్న మార్కెట్
మళ్లీ నష్టాల్లో ముగిసిన మార్కెట్
నష్టాల బాటలోకి సెన్సెక్స్