స్టాక్ మార్కెట్ శుక్రవారం స్థిరంగా కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 62 పాయింట్లు పుంజుకుని 13,174 వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు స్వల్పంగా కోలుకుని 3,954 వద్ద కొనసాగుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిప్లా, రిలయన్స్ ఇన్‌ఫ్రా, బీహెచ్‌ఈఎల్, డీఎల్ఎఫ్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, జైప్రకాశ్ అసోసియేట్స్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏసీసీ, హిందుస్థాన్ యునిలివర్ తదితర సంస్థల వాటాలు నష్టాలతో ఉన్నాయి.
|