స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల బాటలో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 411 పాయింట్లు బలపడి 13,579 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 130 పాయింట్లు పుంజుకుని 4,077 వద్ద కొనసాగుతోంది.
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఎస్‌బీఐ, డీఎల్ఎఫ్, భారతి ఎయిర్‌రటెల్, జైప్రకాశ్ అసోసియేట్స్, బీహెచ్ఈఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనిస్తుండగా... సత్యం, విప్రో, రాన్‌బాక్సీ, టాటా స్టీల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
దీంతో ఇప్పటివరకు మొత్తం 2,622 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 1,597 కంపెనీల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే 935 కంపెనీల వాటాలు నష్టాల్లో ఉండగా... మిగిలిన 90 కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.
|