స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల బాటలో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 181 పాయింట్లు బలపడి 13,817 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 4,135 వద్ద కొనసాగుతోంది.
ఐటీసీ, హిందుస్థాన్ యునిలివర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిప్లా, ఎస్‌బీఐ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, రాన్‌బాక్సీ తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనించాయి. అలాగే సత్యం, డీఎల్ఎఫ్, బీహెచ్ఈఎల్, భారతి ఎయిర్‌టెల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు మొత్తం 2,214 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 1,181 కంపెనీల వాటాలు నష్టాలను చవిచూశాయి. అలాగే 961 కంపెనీల వాటాలు లాభపడగా... మిగిలిన కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.
|