స్టాక్ మార్కెట్ సోమవారం క్రమంగా బలహీనపడుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 83 పాయింట్లతో 13,718 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 4,137 వద్ద కొనసాగుతోంది.
రాన్‌బాక్సీ, సిప్లా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యునిలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, జైప్రకాశ్ అసోసియేట్స్, టీసీఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా స్టీల్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనిస్తుండగా... సత్యం, అంబుజా సిమెంట్స్, భారతి ఎయిర్‌టెల్, బీహెచ్ఈఎల్, ఎల్అండ్‌టీ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు మొత్తం 2,529 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 1,399 కంపెనీల వాటాలు నష్టాలను చవిచూశాయి. అలాగే 1,050 కంపెనీల వాటాలు లాభపడగా... మిగిలిన 80 కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.
|