స్టాక్ మార్కెట్ బుధవారం 15వేల మార్కు దిశగా పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 730 పాయింట్లు బలపడి 14,834 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 214 పాయింట్లు పెరిగి 4,454 వద్ద కొనసాగుతోంది.
ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, బీహెచ్ఈఎల్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, డీఎల్ఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, జైప్రకాశ్ అసోసియేట్స్... తదితర సంస్థల వాటాలు లాభాల్లో నడుస్తున్నాయి.
ఇప్పటివరకు మొత్తం 2,627 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 2,182 కంపెనీల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే 401 కంపెనీల వాటాలు నష్టాల్లో ఉండగా.. మిగిలిన 41 కంపెనీల వాటాలు స్థిరంగా నిలిచాయి.
|