ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > మార్కెట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్  Search similar articles
స్టాక్ మార్కెట్ బుధవారం భారీ లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 838 పాయింట్లు బలపడి 14, 942 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 237 పాయింట్లు పుంజుకుని 4,477 వద్ద ముగిసింది. మంగళవారం పార్లమెంటులో విశ్వాస తీర్మానంలో యూపీఏ ప్రభుత్వం నెగ్గిన నేపధ్యంలో బుధవారం దాని ప్రభావం మార్కెట్‍‌పై పడింది.

దాదాపు 482 పాయింట్ల లాభంతో 14,586 వద్ద ఇండెక్స్ సూచీ ప్రారంభమయింది. ఫైనాన్షియల్ కొనుగోళ్లు.. అమ్మకాలతో ఇండెక్స్ అదే పనిగా ఉన్నత స్థాయి దిశగా పరుగులు పెట్టడం నేటి మార్కెట్ కీలకం. దీంతో ఒకానొక దశలో ఇండెక్స్ సూచీ 14,980 వద్దకు చేరింది. చివరలో ముగిసిన ఐదు ట్రేడింగ్‌లలో సెన్సెక్స్ 18.8 శాతం మేర పుంజుకోవడాన్ని చూస్తే స్టాక్ మార్కెట్ ఏ మేరకు బలపడిందో అర్ధమవుతుంది.

దీంతో బుధవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,758 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా.... 2,257 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 442 కంపెనీల వాటాలు నష్టాలను చవిచూడగా... మిగిలిన కంపెనీల వాటాలు స్థిరంగా ముగిశాయి.

లాభపడ్డ కంపెనీలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్ఈఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇన్‌ఫ్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డీఎల్ఎఫ్, జైప్రకాశ్ అసోసియేట్స్, ఎల్అండ్‌టీ, రిలయన్స్, భారతి ఎయిర్‌రటెల్, ఏసీసీ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.

నష్టపోయిన కంపెనీలు
సిప్లా, హిందుస్థాన్ యునిలివర్ మినహా ఇతర కంపెనీ స్వల్ప నష్టాలను చవిచూశాయి.
మరిన్ని
15వేల మార్కు దిశగా సెన్సెక్స్
పుంజుకున్న సెన్సెక్స్: బలపడుతున్న మార్కెట్
లాభాలతో ముగిసిన మార్కెట్
లాభాలతో దూసుకెళుతున్న మార్కెట్
కదలికలేని సెన్సెక్స్: నిలకడగా మార్కెట్
లాభాలతో ముగిసిన మార్కెట్