స్టాక్ మార్కెట్ మళ్లీ రెడ్ మార్క్‌లోకి ప్రవేశించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 14,388 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 24 పాయింట్లు బలహీనపడి 4,267 వద్ద పయనిస్తోంది.
ఇప్పటి వరకు మొత్తం 2,144 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 722 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 1,355 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌యూఎల్, విప్రో, సన్ ఫార్మా, హీరో హోండా తదితర కంపెనీల వాటాలు లాభాల్లో ఉండగా.. హిండాల్కో, ఏసీసీ, టాటా స్టీల్, జేపీ అసోసియేట్స్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. |