ఆమెరికా స్టాక్ మార్కెట్లు... ఆర్థిక రికవరీపై వస్తున్న వార్తల నేపథ్యంలో అమెరికా స్టాకులు నష్టాలతో ముగిశాయి. కానీ, మార్చి-జూన్ త్రైమాసికంలో దశాబ్ద కాలంలో అత్యుత్తమగా ఫలితాలుగా నమోదయ్యాయి.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.97 శాతంతో 82.38 పాయింట్లు క్షీణించి 8,447 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్ - 0.85 శాతంతో 7.91 పాయింట్లు నష్టపోయి 919.32 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.49 శాతంతో 9.02 పాయింట్లు బలహీనపడి 1,835.04 వద్దకు చేరుకుంది.
ఆసియా స్టాక్ మార్కెట్లు...
ఆసియా స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో పయనిస్తున్నాయి. నిక్కీ (జపాన్) - 112 పాయింట్లు లాభపడి 10,071 వద్దకు చేరుకుంది. షాంఘై (చైనా) - 33 పాయింట్లు బలపడి 2,993 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్ ఇండెక్స్ - 23 పాయింట్లు పెరిగి 1,413 వద్దకు చేరుకుంది. టైవాన్ - 2.26 శాతంతో 145 పాయింట్లు వృద్ధి చెంది 6,577 వద్దకు చేరుకుంది. |