స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 145 పాయింట్లు పుంజుకుని 14,639 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 59 పాయింట్లు బలపడి 4,350 వద్ద పయనిస్తోంది.
ఇప్పటి వరకు మొత్తం 2,640 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,375 కంపెనీల వాటాలు నష్టాలను చవిచూశాయి. డీఎల్ఎఫ్, ఎంఅండ్ఎం, ఆర్‌కామ్, టాటా మోటార్స్, భారతి, ఎస్‌బీఐ తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. |