స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 152 పాయింట్లు పుంజుకుని 14,646 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 4,350 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.05 శాతం, నిఫ్టీ 1.36 శాతం చొప్పున వృద్ధి చెందాయి.ఈ రోజు 27 పాయింట్ల లాభంతో 14,506 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ఆసియా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలతో కూడిన సంకేతాల ప్రభావాన ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ క్షీణించింది. దీంతో సెన్సెక్స్ రెడ్ మార్కులో ప్రవేశించింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 14,355 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.అయితే చిన్న స్థాయి కంపెనీల భారీ కొనుగోళ్లతో ఇండెక్స్ తిరిగి పుంజుకోగలిగింది. దీంతో సెన్సెక్స్ గరిష్ఠంగా 370 పాయింట్లు లాభపడి 14,727 వద్ద చేరుకుంది. చివరికి సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో ముగిసింది. బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 4 శాతం మేరకు వృద్ధి చెందింది. కాగా, సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,670 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,335 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనించాయి. అలాగే మిగిలిన కంపెనీల వాటాలు లాభపడ్డాయి.లాభపడ్డ కంపెనీలుడీఎల్ఎఫ్, ఎంఅండ్ఎం, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఆర్‌కామ్, రిలయన్స్, టాటా మోటార్స్, భారతి, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్ తదతర కంపెనీల వాటాలు లాభపడ్డాయి.నష్టాలను చవిచూసిన కంపెనీలుహిండాల్కో, ఓఎన్‌జీసీ, ఏసీసీ, టాటా పవర్, గ్రాసిం తదితర కంపెనీల వాటాలు నష్టాలను చవిచూశాయి. |