అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం బాంబే స్టాక్ మార్కెట్‌పై పడింది. అమెరికా మార్కెట్లు మంచి ర్యాలీని కొనసాగించినా, ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలను చవిచూడటంతో బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతోనే ప్రారంభమైంది.
దీంతో ట్రేడింగ్ ప్రారంభంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 44 పాయింట్లు క్షీణించి, 14,601 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 24 పాయింట్లు పడిపోయి, 4,316 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, జై కార్పొరేషన్ లిమిటెడ్, ఆకృతి సిటి, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐఆర్‌బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలుండగా, ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అరెవా, మ్యాక్స్ ఇండియా లిమిటెడ్, ఎబిబి లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటన పయనిస్తున్నాయి. |