ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైన బాంబే స్టాక్ మార్కెట్ అదేబాటలో పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే, సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మార్కెట్ మందకొడిగా ముందుకు సాగుతోంది.
ట్రేడింగ్ ప్రారంభమైన ఒక గంటలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ 31 పాయింట్ల స్వల్ప నష్టంతో, 14,614 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 5 పాయింట్లు క్షీణించి, 4,335 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, జై కార్పొరేషన్ లిమిటెడ్, ఆకృతి సిటి, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐఆర్‌బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలుండగా, ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అరెవా, మ్యాక్స్ ఇండియా లిమిటెడ్, ఎబిబి లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటన పయనిస్తున్నాయి. |