ఆసియా మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత, యూరోపియన్ మార్కెట్ల ట్రేడింగ్ నత్తనడకన నడుస్తుండటంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను నమోదు చేసుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 127 పాయింట్లు క్షీణించి, 14,518 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 36 నష్టపడి, 4,304 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, జిఎఐఎల్ ఇండియా లిమిటెడ్, తులిప్ టెలికాం లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు లాభాలను ఆర్జించాయి. అయితే ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అరెవా, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |