బాంబే స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల బాటలోనే పయనిస్తోంది. విదేశీ మార్కెట్ల ప్రభావం, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకటన వంటి పలు కారణాల వల్ల బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.
గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 102 పాయింట్లు క్షీణించి, 14,543 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 34 పాయింట్లు కోల్పోయి, 4,306 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, జిఎఐఎల్ ఇండియా లిమిటెడ్, తులిప్ టెలికాం లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు లాభాలను ఆర్జించాయి. అయితే ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అరెవా, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |