బాంబే స్టాక్ మార్కెట్ మెల్ల మెల్లగా కోలుకుంటుంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 70 పాయింట్ల మేర క్షీణించి, 14,574 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22 పాయింట్లు పడిపోయి, 4,318 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, జిఎఐఎల్ ఇండియా లిమిటెడ్, తులిప్ టెలికాం లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు లాభాలను ఆర్జించాయి. అయితే ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అరెవా, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |