గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో లాభాలను గడించింది. ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 38 పాయింట్లు వృద్ధి చెంది, 14682 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్ల స్వల్ప లాభంతో, 4355 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. టొరెంట్ పవర్ లిమిటెడ్, గుజ్. మినరల్ దేవ్, జిఎఐఎల్ ఇండియా లిమిటెడ్, ఐఆర్‌బి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓఎన్‌జీసీ వంటి సంస్థలుండగా, ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అబాన్ ఆఫ్‌షోర్ లిమిటెడ్, బజాజ్ ఆటో లిమిటెడ్, ముంద్రా పోర్ట్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |