ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > సెన్సెక్స్ > రైల్వే బడ్జెట్ ప్రభావం: స్వల్పలాభాలతో ముగిసిన సెన్సెక్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రైల్వే బడ్జెట్ ప్రభావం: స్వల్పలాభాలతో ముగిసిన సెన్సెక్స్
FILE
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రకటించనుంది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్పలాభాలను ఆర్జించింది.

గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 13 పాయింట్ల మేర లాభపడి 14,658 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 7 పాయింట్ల స్వల లాభంతో 4,348 పాయింట్ల వద్ద ముగిసింది.

ట్రేడింగ్ ప్రారంభంలో విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనతతో నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ మార్కెట్, ఓ దశలో మెల్లమెల్లగా కోలుకుని స్వల్ప లాభాలతో ర్యాలీని కొనసాగించింది. తదనంతం రైల్వే బడ్జెట్ ప్రభావంతో స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంది.

ఇక టొరెంట్ పవర్ లిమిటెడ్, గుజ్, మినరల్‌దేవ్, గెయిల్ (ఇండియా) లిమిటెడ్, సింటెక్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ సంస్థలు లాభాలను ఆర్జించగా, ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ముంద్రా పోర్ట్, బయోకాన్, అబాన్ ఆఫ్‌షోర్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
హమ్మయ్య..! సెన్సెక్స్ కోలుకుంది
మెల్లమెల్లగా కోలుకుంటున్న సెన్సెక్స్
నష్టాల బాటలోనే సెన్సెక్స్ పయనం
మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత: సెన్సెక్స్ పతనం
స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్
స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్