ట్రేడింగ్ ప్రారంభంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్, రైల్వే బడ్జెట్ ప్రభావంతో పుంజుకుంది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన ఒక గంటలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి, 14,693 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 4 పాయింట్ల స్వల్ప లాభంతో, 4,353 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, కంటైనర్ కార్పొరేషన్, బజాజ్ హోల్డింగ్స్, గ్లెమార్క్ పార్మా, రాన్‌బాక్సీ వంటి సంస్థలుండగా, గుజ్ మినరల్ దేవ్, ఎడ్యుక్యాంప్ సొల్యూషన్స్, టొరెంట్ పవర్ లిమిటెడ్, సీసా, కెయిర్న్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |