ఊహించని విధంగా "జాబ్ రిపోర్ట్" దారుణంగా వుండటంతో అమెరికా స్టాక్ మార్కెట్ కుదేలైంది. అమెరికా స్టాక్ మార్కెట్‌లో ప్రధాన సూచీలు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. దీంతో 2.5 శాతం పతనం చెంది డోజోన్స్ 212 పాయింట్ల నష్టంతో, 8280 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అదేవిధంగా మరో అమెరికా ప్రధాన సూచి నాస్‌డాక్ 2.7 శాతంతో 49 పాయింట్లు, ఎస్అండ్‌పీ 2.9 శాతంతో 26 పాయింట్లు క్షీణించింది. డోజోన్స్ సూచీలోని 30 షేర్లు నష్టాలనే చవిచూశాయి. జూన్ మాసానికి విడుదల చేసిన జాబ్ రిపోర్టులో సుమారు 450,000 ఉద్యోగాలకు కోత పడినట్లు లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించడంతో అమెరికా స్టాక్ మార్కెట్ ప్రతికూలంగా స్పందించిందని ఆర్థిక విశ్లేషకులు అన్నారు. |