కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమత బెనర్జీ శుక్రవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల దిశగా పయనిస్తోంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 54 పాయింట్లు బలపడి, 14,712 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్ప లాభంతో 4,367 మార్కు వద్ద పయనిస్తోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో.. హింద్ కాపర్, కంటైనర్ కార్పొరేషన్, బజాజ్ హోల్డింగ్స్, గ్లెమార్క్ పార్మా, రాన్‌బాక్సీ వంటి సంస్థలుండగా, గుజ్ మినరల్ దేవ్, ఎడ్యుక్యాంప్ సొల్యూషన్స్, టొరెంట్ పవర్ లిమిటెడ్, సీసా, కెయిర్న్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |