ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > సెన్సెక్స్ > ఊపందుకున్న ట్రేడింగ్: సెన్సెక్స్ వృద్ధి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఊపందుకున్న ట్రేడింగ్: సెన్సెక్స్ వృద్ధి
రైల్వేశాఖ మంత్రి మమత బెనర్జీ ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ ప్రభావం, ట్రేడింగ్ ఊపందుకోవడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుంది. రైల్వే బడ్జెట్‌లో భాగంగా.. నిరవధిక రైలు సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి మమత బెనర్జీ ప్రకటించారు.

దీంతో బాంబే స్టాక్ మార్కెట్ సానుకూలంగా స్పందించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు 65 పాయింట్లు వృద్ధి చెంది, 14721 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 17 పాయింట్ల స్వల్వ లాభంతో 4366 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

ఇక లాభపడ్డ కంపెనీల్లో గ్లెమార్క్ పార్మాక్యూటికల్స్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ, అడాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, హింద్, కాపర్, జైన్ ఇర్రిగేషన్ వంటి సంస్థలుండగా, గుజ్. మినరల్ దేవ్, ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, కెఎస్‌కె ఎనర్జీ వెంచర్స్, బీఈఎంఎల్ లిమిటెడ్, జై కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మమత రైల్వే బడ్జెట్ ప్రకటన: సెన్సెక్స్ వృద్ధి
కుదేలైన అమెరికా స్టాక్ మార్కెట్
బడ్జెట్ ప్రభావంతో పుంజుకున్న సెన్సెక్స్
మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్
విదేశీ కరెన్సీ రేట్లు
నేటి బులియన్ మార్కెట్ ధరలు