బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తోంది. బడ్జెట్ ప్రభావంతో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారీగా వృద్ధి చెందింది.
దీంతో సెన్సెక్స్ 247 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుని, 14908 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 72 పాయింట్ల మేర లాభపడి, 4421 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
ఇక లాభపడ్డ కంపెనీల్లో గ్లెమార్క్ పార్మాక్యూటికల్స్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ, అడాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, హింద్, కాపర్, జైన్ ఇర్రిగేషన్ వంటి సంస్థలుండగా, గుజ్. మినరల్ దేవ్, ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్, కెఎస్‌కె ఎనర్జీ వెంచర్స్, బీఈఎంఎల్ లిమిటెడ్, జై కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. |