ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > సెన్సెక్స్ > లాభాలతో ముగిసిన సెన్సెక్స్: 255 పాయింట్ల వృద్ధి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లాభాలతో ముగిసిన సెన్సెక్స్: 255 పాయింట్ల వృద్ధి
FILE
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల్లో నడిచింది. ఆసియా, అమెరికా మార్కెట్‌‍ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో 105 పాయింట్ల పతనమై 14,553 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాసేపటికే 14,500 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అనంతరం బీఎస్ఈ సూచి క్రమక్రమంగా పుంజుకుంది.

కేంద్ర బడ్జెట్ నుంచి ఆశాజనక సంకేతాలు రావడంతో ఒకానొక దశలో కనిష్ట స్థాయి నుంచి 446 పాయింట్లు వృద్ధి చెంది 14,946 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆర్థిక సర్వే, రైల్వే బడ్జెట్ ఆశాజనక వాతావరణం సృష్టించడంతో మార్కెట్ ముగింపు వరకు లాభాల్లోనే కొనసాగింది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు వృద్ధి చెంది 14,913 వద్ద స్థిరపడింది.

ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు లాభాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 75 పాయింట్లు పుంజుకొని 4424 వద్ద నిలిచింది. మార్కెట్ లావాదేవీల్లో హెచ్‌డీఎఫ్‌సీ వాటాలు 8 శాతం, టాటా స్టీల్ వాటాలు 4.5 శాతం పుంజుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 3.5 శాతం లాభపడ్డాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భారీ లాభాల దిశగా స్టాక్ మార్కెట్
లాభాలతో ర్యాలీని కొనసాగిస్తోన్న స్టాక్ మార్కెట్
ఊపందుకున్న ట్రేడింగ్: సెన్సెక్స్ వృద్ధి
మమత రైల్వే బడ్జెట్ ప్రకటన: సెన్సెక్స్ వృద్ధి
కుదేలైన అమెరికా స్టాక్ మార్కెట్
బడ్జెట్ ప్రభావంతో పుంజుకున్న సెన్సెక్స్