పార్లమెంట్‌లో రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్ ప్రకటించిన అనంతరం స్టాక్ మార్కెట్ ఆలస్యంగా పుంజకుంది. అయినా 254 పాయింట్లకు పైగా లాభపడింది. సానుకూల రైల్వే బడ్జెట్‌గా ఆర్థిక నిపుణులు అంచనాలు వేయడం, మార్కెట్‌లో ట్రేడింగ్ సెంటిమెంట్ బాగా పనిచేయంతో ట్రేడింగ్ ముగింపులో స్టాక్ మార్కెట్ వృద్ధి చెందిందని మార్కెట్ వర్గాల అభిప్రాయం.
నిన్నటి ముగింపులో సెన్సెక్స్ 1.74 శాతం మేరకు లాభపడి 14,913 వద్ద ముగిసింది. రైల్వే బడ్జెట్‌లో గూడ్సు రవాణా ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం.. దీని ప్రభావంతో నిన్న సాయంత్రం ట్రేడింగ్ ముగియక ముందు స్టాక్ మార్కెట్ గరిష్ఠంగా 14,945.85 వద్దకు చేరుకుంది.
అదలా ఉంచితే.. మార్కెట్ వృద్ధికి బ్యాంకింగ్, హెవీ మెషినరీ, విద్యుత్, హెల్త్ కేర్, రియాల్టీ స్టాకుల నుండి ప్రధానంగా మద్దతు అందిందని నిపుణులు వెల్లడించారు. |