స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 31 పాయింట్లు పుంజుకుని 16,248 వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 4,823 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ 0.19 శాతం, నిఫ్టీ 0.09 శాతం మేరకు వృద్ధి చెందాయి.
ఇప్పటి వరకు మొత్తం 2,850 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,755 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే మిగిలిన కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి. హిండాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, విప్రో, ఎల్అండ్‌టీ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి.