సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » వారాతంలో లాభాలతో ముగిసి సెన్సెక్స్ (Stock Market | Sensex losses in weekend | BSE | NSE | trade | Reliance | Turnover)
 
File
FILE
స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 47 పాయింట్లు పుంజుకుని 16,264 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 4,830 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.29, నిఫ్టీ 0.21 శాతం మేరకు వృద్ధి చెందాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో ఈ రోజు ఉదయం 38 పాయింట్ల లాభంతో... 16,254 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో లాభపడినప్పటికీ... స్టాక్ మార్కెట్లో ఆ లాభాలు ఎక్కువ సేపు నిలబడలేకపోయాయి. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్ 208 పాయింట్లు బలహీనపడి 16,130 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.

అయితే మధ్యాహ్నపు ట్రేడ్‌లలో సెన్సెక్స్ ఎట్టకేలకు తిరిగి రికవరీ కాగలిగింది. దీంతో 16,264 వద్ద స్టాక్ మార్కెట్ ముగిసింది. బీఎస్ఈ బ్యాంకెక్స్, ఐటీ ఇండెక్స్‌లు ఒక శాతం చొప్పున లాభపడగా.. రియాల్టీ ఇండెక్స్‌ 1.5 శాతం మేరకు క్షీణించింది.

కాగా, సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,868 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,717 కంపెనీల వాటాలు నష్టపోయాయి. 1,070 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.

లాభపడ్డ కంపెనీలు
హిండాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, ఐటీ స్టాకులు.. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.

నష్టాలను చవిచూసిన సంస్థలు
స్టెరిలైట్, డీఎల్ఎఫ్, హిందుస్థాన్ యునిలివర్, ఆటో స్టాకులు కూడా నష్టపోయాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హీరో హోండా, ఏసీసీ, జేపీ అసోసియేట్స్, ఆర్‌కామ్, గ్రాసిం, టాటా పవర్ తదితర సంస్థల వాటాలు నష్టపోయాయి.

అత్యధిక టర్నోవర్
రూ. 941.03 కోట్లతో రిలయన్స్ అత్యధిక టర్నోవర్ సాధించగా.. దాని తర్వాత స్థానంలో.. డీఎల్ఎఫ్‌ రూ. 904.58 కోట్లు.. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 674.92 కోట్లు, హెచ్‌డీఐఎల్ రూ. 643.96 కోట్లు, యునిటెక్ రూ. 618.37 కోట్లు ఆర్జించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.