సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్టాక్ మార్కెట్: వారపు సమీక్ష (Stock Market | Weekly review | trade | BSE | NSE | Monsoon | G 20 summit | Pranab)
 
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో ముగిసింది. రుతుపవనాలు ఇప్పుడిప్పుడే ప్రభావం చూపుతుండటం.. వరుసగా రెండో నెలలో పారిశ్రామికోత్పత్తి విస్తరణ తదితర అంశాలు స్టాక్ మార్కెట్ వృద్ధికి దోహదం చేశాయి.

సోమవారం రోజున స్టాక్ మార్కెట్ 16వేల మార్కును దాటింది. దీంతో సుమారు 15నెలల గరిష్ఠ స్థాయిని చేరుకుంది. మరిన్ని విదేశీ పెట్టుబడులకు చైనా ఆహ్వానం పలకడం.. వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లను బలోపేతం చేశాయి.

దీనికి తోడు.. జీ-20 దేశాల సదస్సులో భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటన కూడా మార్కెట్ సెంటిమెంటును మెరుగుపరిచింది. ఉద్దీపనలను ఇంకా కొనసాగిస్తామని ప్రణబ్ ఈ సదస్సులో ప్రకటన చేశారు. ఈ వారం మొత్తంపై తీసుకుంటే.. సెప్టెంబర్ రెండో వారంలోను రుతుపవనాల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

దీంతో ఈ సానుకూల వార్త.. స్టాక్ మార్కెట్లో యథావిధిగా లాభాలు కొనసాగవచ్చే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి అదనంగా.. జూలైలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) సంఖ్యల్లో 6.8 శాతం వృద్ధిని సాధించిన గత వారంలో ప్రకటన స్టాక్ మార్కెట్లో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.