ఐదు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ... అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో.. అమెరికా మార్కెట్లు ఫ్లాట్ నోట్ వద్ద ముగిసినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.23 శాతంతో 22 పాయింట్లు కోల్పోయి 9,601 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్ - 0.14 శాతంతో 1.41 పాయింట్లు నష్టపోయి 1,042.73 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.15 శాతంతో 3.12 పాయింట్లు బలహీనపడి 2,081 వద్దకు చేరుకుంది.