సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » రెడ్ మార్క్‌లోనే పయనిస్తున్న స్టాక్ మార్కెట్‌ (Stock Market | Red Mark | Sensex | BSE | NSE | trade)
 
స్టాక్ మార్కెట్‌లలో ట్రేడింగ్ రెడ్ మార్కులోనే నడుస్తోంది. దీంతో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 142 పాయింట్లు కోల్పోయి 16,993 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 5,041 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.83 శాతం, నిఫ్టీ 0.83 శాతం మేరకు వృద్ధి చెందాయి.

ఐటీసీ అత్యధికంగా లాభాల్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో హీరో హోండా, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా తదితర సంస్థల వాటాలు ఉన్నాయి. అలాగే గ్రాసిం అత్యధికంగా నష్టాల్లో ఉంది. దాని తర్వాత స్థానాల్లో డీఎల్ఎఫ్, ఎస్‌బీఐ, హిండాల్కో, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.