ఆసియా స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం రెడ్ మార్కులో పయనిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు నుంచి బలహీన సంకేతాలతో ఆసియా మార్కెట్లను మూడు వారాల కనిష్ఠ స్థాయిని చేరుకున్నాయి. అలాగే మూడో త్రైమాసిక ఫలితాలు దగ్గర్లో పడనున్నాయనే అంశాలు ఇన్వెస్టర్లను మరింత జాగ్రత్తకు పోయేలా చేసింది.
హాంగ్ సెంగ్- 35 పాయింట్లు కోల్పోయి 20,340 వద్దకు చేరుకుంది.
నిక్కీ- 57 పాయింట్లు నష్టపోయి 9,675 వద్దకు చేరుకుంది.
షాంఘై- 25 పాయింట్లు బలహీనపడి 2,780 వద్దకు చేరుకుంది.
సియోల్ కంపోజిట్- 2 శాతంతో 39 పాయింట్లు తగ్గి 1,606 వద్దకు చేరుకుంది.