స్టాక్ మార్కెట్లో మరింతగా నష్టాలు విస్తరిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 191 పాయింట్లు కోల్పోయి 16,944 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 5,027 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 1.11 శాతం చొప్పున క్షీణించాయి.
బీఎస్ఈ మధ్యతరహా ఇండెక్స్ 0.56 శాతం, బీఎస్ఈ చిన్న తరహా ఇండెక్స్ 0.72 శాతం మేరకు క్షీణించాయి. ఇప్పటి వరకు మొత్తం 2,632 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,552 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 1,019 కంపెనీల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్ ఫార్మా తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉండగా.. గ్రాసిం, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, ఎస్‌బీఐ, హిండాల్కో, డీఎల్ఎఫ్, రిలయన్స్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.