సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నష్టాల్లో కూరుకపోతున్న స్టాక్ మార్కెట్ (Stock Market | Sensex | losses | BSE | NSE | trade | Index)
 
స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 222 పాయింట్లు కోల్పోయి 16,913 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 5,016 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.30 శాతం, నిఫ్టీ 1.32 శాతం మేరకు క్షీణించాయి.

బీఎస్ఈ రియాల్టీ, బ్యాంకెక్స్, చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్ 1 శాతం మేరకు క్షీణించాయి. భారతీ ఎయిర్‌టెల్, గ్రాసిం, ఆర్‌కామ్, జేపీ అసోసియేట్స్, హిండాల్కో, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎస్‌‌బీఐ, డీఎల్ఎఫ్, టీసీఎస్, రిలయన్స్, టాటా స్టీల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉండగా.. రిలయన్స్ ఇన్‌ఫ్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యునిలివర్ సంస్థలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.

ఇప్పటి వరకు మొత్తం 2,751 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,816 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 867 కంపెనీల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.