సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » 246 పాయింట్ల నష్టంతో స్టాక్ మార్కెట్ (Stock Market | losses 246 points | Sensex | BSE | NSE | trade | Index)
 
స్టాక్ మార్కెట్ 246 పాయింట్లు నష్టంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,888 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 5,010 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ 1.44 శాతం చొప్పున క్షీణించాయి.

రియాల్టీ, చమురు మరియు సహజవాయువుల షేర్లలో విక్రయాలు స్థిరంగా కొనసాగుతుండటంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి కూరుకుపోతోంది. భారతీ ఎయిర్‌టెల్, హిండాల్కో, గ్రాసిం, ఆర్‌కామ్, స్టెరిలైట్, జేపీ అసోసియేట్స్, మారుతీ, డీఎల్ఎఫ్, టాటా మోటార్స్, టీసీఎస్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉండగా.. ఐటీసీ, సన్ ఫార్మా, రిలయన్స్ ఇన్‌ఫ్రా తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి.

కాగా, ఇప్పటి వరకు 2,795 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 2,012 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 733 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.