సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సమయం పెరగనుంది! (Stock Market | trading timings | Sebi | NSE | BSE | nifty)
Feedback Print Bookmark and Share
 
రెండున్నర గంటల పాటు అదనంగా ట్రేడింగ్ జరపేందుకు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇంజియా (సెబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సమయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉదయం 9 నుంచి 5 గంటల మధ్య ఈ ట్రేడింగ్ సమయాలను ఆచరణలోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సమయం.. ఉదయం 9.55 నుంచి మధ్యాహ్నం 03.30 నిమిషాల వరకు జరుగుతోంది. ట్రేడింగ్ సమయం పెంపుపై సెబీ నిర్ణయాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్‌లు ఆహ్వానించాయి. అయితే.. ఉదయం 9 గంటలకే ప్రారంభించి సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు స్పష్టంగా తెలుపలేదు.

గత ఏడాదే ఎన్ఎస్ఈ.. ట్రేడింగ్ సమయం పెంచాలని ప్రతిపాదించింది. సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎస్‌జీఎక్స్)లో ట్రేడింగ్‌కు అనుగుణంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉండేందు కోసమని ఎన్ఎస్ఈ ఈ ప్రతి పాదన చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.