ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్వల్పనష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్ (Finance| Sensex| Bombay Stock market| Nifty| Loss| International Markets)
సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలతో ప్రారంభమైన బాంబే స్టాక్ మార్కెట్.. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంది.
ఆసియా, అమెరికా, యూరప్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ 11 పాయింట్లు స్వల్ప నష్టంతో 16, 799 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 3 పాయింట్లు స్వల్పంగా క్షీణించి 4, 933 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఆసియా మార్కెట్లు మెల్ల మెల్లగా పుంజుకుని లాభాలను నమోదు చేసుకోవడం, రిజర్వ్ బ్యాంక్ మంగళవారం ద్రవ్యపరపతి విధానంపై సమీక్షా సమావేశం నిర్వహించడంతో స్టాక్ మార్కెట్ లాభాల దిశగా పయనించే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంటున్న సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్ ముగింపులోపు పుంజుకునే అవకాశం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.