సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » అమ్మకపు ఒత్తిడి: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ (Finance| Sensex| Bombay Stock market| Nifty| Loss| International Markets| Shares)
Feedback Print Bookmark and Share
 
సోమవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచి రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 70 పాయింట్లు క్షీణించి, 16,740 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని ముగించింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 26 పాయింట్ల నష్టంతో 4,970 పాయింట్ల వద్ద నిలిచింది.

ఆర్‌బీఐ మంగళవారం ద్రవ్యపరపతి విధానంపై సమీక్షా సమావేశం నిర్వహించడం ద్వారా సెన్సెక్స్ పుంజుకుంటుందని మదుపుదారులు ఆశించారు. కానీ అపెక్స్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గించకపోవడం, దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ మార్కెట్‌ నష్టాలతో ముగిసిందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

బ్యాంకింగ్, రియాల్టీ, బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్ మరియు పీఎస్‌యూ వాటాలు అమ్మకపు ఒత్తిడికి గురయ్యాయి. అలాగే అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగియడం కూడా స్టాక్ మార్కెట్ పతనానికి ఓ కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే.. థింక్‌సాఫ్ట్, లోటస్‌సీహెచ్‌‌ఓ. బీవోలు లాభాలు ఆర్జించిన సంస్థల్లో అగ్రస్థానంలో ఉండగా, ఆర్ఈఎన్ సిక్స్ టెన్ రీటైల్, గామన్ ఇన్ఫ్రా వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.