సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నష్టాలతో ప్రారంభమైన బాంబే స్టాక్ మార్కెట్ (Finance| Sensex| Bombay Stock market| Nifty| Loss| International Markets| Shares)
Feedback Print Bookmark and Share
 
సోమవారం నష్టాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా ర్యాలీని తిరోగమనం వైపే కొనసాగిస్తోంది. మదుపుదారులు అమ్మకాల వైపు మొగ్గుచూపడం, అమెరికా మార్కెట్ పతనమవడంతో నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో 103 పాయింట్ల మేర క్షీణించి 16, 635 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 29 పాయింట్ల పతనంతో 4, 941 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

మంగళవారం ఆసియా, అమెరికా మార్కెట్ల ట్రేడింగ్ బలహీనంతోనే బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలవైపు పయనిస్తోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒకవేళ విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకున్నట్లైతే బాంబే స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా సాగే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే.. ద్రవ్యపరపతి విధానంపై మంగళవారం ఆర్‌బీఐ సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకునే అవకాశాలున్నాయని వారు అంటున్నారు.

ఇదిలా ఉంటే.. లోటస్, ఎన్నార్ఎ గ్రిండ్ క్యూలు లాభాలు నమోదు చేసుకున్న కంపెనీల్లో అగ్రస్థానంలో నిలవగా, ఎడ్యుక్యాంప్, ఎస్ఆర్‌పీఎంఎల్ సంస్థలు నష్టాలు బాటలో పయనిస్తున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.