ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. సోమవారం తరహాలోనే మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో 152 పాయింట్లు పతనమై 16,586 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 37 పాయింట్లు క్షీణించి 4, 933 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
మెటల్, రియాల్టీ, పవర్ వాటాలు అమ్మకపు ఒత్తిడికి గురవడం, ట్రేడింగ్ పుంజుకోకపోవడం వంటి కారణాలే బాంబే స్టాక్ మార్కెట్ కొంపముంచాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ద్రవ్యపరపతి విధానంపై ఆర్‌బీఐ నిర్వహించనున్న సమీక్షా సమావేశంపై మదుపుదారులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఆర్‌బీఐ నిర్వహించే ఈ సమావేశంతో స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా సాగే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.