సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » ట్రేడింగ్ బలహీనత: నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ (Finance| Sensex| Bombay Stock market| Nifty| Loss| International Markets| Shares)
Feedback Print Bookmark and Share
 
బాంబే స్టాక్ మార్కెట్‌కు ఈ వారం ప్రారంభంలోనే చుక్కెదురైంది. సోమవారం నష్టాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్.. మంగళవారం కూడా యధావిథిగా నష్టాల్లోనే కూరుకుపోయింది.

దీంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 194 పాయింట్లు పడిపోయి, 16,546 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 85 పాయింట్లు పతనమై 4,884 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.

ద్రవ్యపరపతి విధానంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసిరాలేదు. మరోవైపు ఆసియా మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకోక పోవడం, మదుపు దారులు కొనుగోళ్లవైపు మొగ్గు చూపకపోవడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలవైపు పయనిస్తోందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.