క్షీణించిన విదేశీ మార్కెట్ల ట్రేడింగ్: భారీ నష్టాల్లో సెన్సెక్స్
ఆసియా, అమెరికా, యూరప్ మార్కెట్ల ట్రేడింగ్ నష్టాల బాటన పయనిస్తుండటంతో.. స్టాక్ మార్కెట్‌కు చుక్కెదురైంది. సోమవారమే నష్టాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా అదే తిరోగమనం వైపే ర్యాలీని కొనసాగిస్తోంది.
దీంతో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 224 పాయింట్లు భారీగా పతనమై, 16,516 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 98 పాయింట్లు క్షీణించి, 4,872 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
ఆర్‌బీఐ విడుదల చేసిన ద్రవ్యపరపతి విధానం, విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత, దేశీయ వాటాల అమ్మకాలతో బాంబే స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోతోందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.