సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » విదేశీ మార్కెట్లకు మంగళవారం బ్లాక్‌డే! (Finance| Sensex| Nifty| Nasdaq| Stock markets| Nikkei)
Feedback Print Bookmark and Share
 
యూరప్ మార్కెట్ మినహా.. విదేశీ స్టాక్ మార్కెట్లకు మంగళవారం బ్లాక్ డేగా పరిణమించింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను నమోదు చేసుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 387 పాయింట్లు కోల్పోయి, 16,353 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 124 పాయింట్ల భారీ నష్టంతో 4,846 పాయింట్ల వద్ద నిలిచింది.

అలాగే భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో అమెరికా డౌ సూచీ 104 పాయింట్లు క్షీణించి, 9,867 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే ఆసియా మార్కెట్లలో జపాన్‌కు చెందిన నికాయ్ సూచీ 150 పాయింట్లు కోల్పోయి, 10,212 మార్కు వద్ద పయనిస్తోంది. హాంగ్ షెంగ్ కూడా 420 పాయింట్ల భారీ నష్టంతో 22, 169 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అయితే యూరప్ ఎఫ్‌టీఎస్ఈ 100- 20 పాయింట్ల స్వల్ప లాభంతో 5,212 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది. అలాగే డాక్స్ సూచీ కూడా 19 పాయింట్ల లాభంతో 5,662 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.